డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ సీనియర్ నేత, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్‌కు గుండెపోటు వచ్చింది. ఈ సంఘటనను గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు శస్త్రచికిత్స చేసి స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. కానీ ఆయనకు కొంతకాలం విశ్రాంతి అవసరం అని వైద్యులు చెప్పారు. పద్మారావుకు గుండెపోటు విషయం తెలిసి బీఆర్ఎస్ శ్రేణులతో పాటు సికింద్రాబాద్ ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అయితే ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వార్త కొంత ఊరట కలిగింది.
ఎమ్మెల్యే పద్మారావుగౌడ్‌కు గుండెపోటు.. ఆస్పత్రిలో చేరిక
by K.N.Chary
Published On: January 21, 2025 7:05 pm
---Advertisement---