పింఛన్ లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఉదంతం కడప జిల్లా జమ్మలమడుగులో చోటుచేసుకుంది. లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జమ్మలమడుగు 16వ వార్డు సచివాలయ సిబ్బంది భారతి వార్డులో 46 మందికి పెన్షన్లు పంపిణీ చేస్తుంది. పెన్షన్ పంపిణీలో ఒక్కో లబ్ధిదారు నుంచి రూ.300 వసూలు చేస్తోంది. డబ్బులు ఇవ్వకపోతే వెరిఫికేషన్‌లో పెన్షన్ తీసేస్తారని భయపెడుతూ వారికి ఇచ్చే సొమ్ములో రూ.300 కట్ చేసుకొని ఇస్తుంది. దీంతో అక్కడున్నవారు డబ్బులు ఎందుకు కట్ చేస్తున్నారని అడగ్గా.. ఆఫీస్ స్టేషనరీ కోసమే డబ్బులు తీసుకుంటున్నానని ఆమె మాటమార్చింది.
ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా వాలంటీర్లు పింఛను ఇస్తే అప్పట్లో గగ్గోలు పెట్టిన చంద్రబాబు
— Troll Kutami (@trollkutami) December 31, 2024
ఇప్పుడు 4,000 పింఛనులో రూ.300 కొట్టేస్తున్న సచివాలయ ఉద్యోగి.
దీనికి ఏం సమాధానం చెప్తావ్@ncbn? pic.twitter.com/IxwJNNrL3O
‘రూ.300 పట్టుకొని పెన్షన్ ఇస్తాను. మీరు ఇవ్వకపోతే వచ్చే నెల పెన్షన్, బియ్యం కార్డు తీసేస్తే మాకు సంబంధం లేదు’ అని సచివాలయ ఉద్యోగి భారతి భయపెట్టినట్లుగా లబ్ధిదారులు వాపోయారు. అక్కడున్న ఓ వ్యక్తి వీడియో రికార్డు చేయడంతో ఈ భాగోతం బట్టబయలైంది. సచివాలయ ఉద్యోగి వసూళ్ల దందా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.