రాష్ట్రపతి, గవర్నర్ అధికారాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

రాష్ట్రపతి–గవర్నర్ అధికారాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

రాష్ట్రపతి (President), గవర్నర్లు (Governors) శాసనసభ (Legislative Assembly) ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి మూడు నెలల గడువు పెట్టిన తీర్పు విషయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం (Supreme Court Constitution Bench) కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రపతి లేదా గవర్నర్‌లకు నిర్ణయానికి నిర్దిష్ట గడువు విధించడం కోర్టుల అధికారం కాదని స్పష్టం చేసింది. అయితే గవర్నర్లు బిల్లులను అనవసరంగా సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉంచితే, అది న్యాయ సమీక్షకు లోబడుతుందని ధర్మాసనం పేర్కొంది. గవర్నర్ ముందు ఆమోదం, రాష్ట్రపతికి రిఫర్ చేయడం, సభకు తిరిగి పంపడం.. ఈ మూడే రాజ్యాంగబద్ధ మార్గాలని స్పష్టం చేసింది.

కేంద్ర ప్రభుత్వం చేసిన “గవర్నర్ బిల్లును సభకు పంపకుండానే నిరవధికంగా నిలుపుకోవచ్చు” అనే వాదనను రాజ్యాంగ ధర్మాసనం తిరస్కరించింది. ఆర్టికల్ 200 కింద గవర్నర్‌కు ఉన్న విచక్షణ అంటే బిల్లును వెనక్కి పంపడం లేదా రాష్ట్రపతికి రిజర్వ్ చేయడం మాత్రమేనని పేర్కొంది. గవర్నర్ అనుమతి లేకుండా శాసనసభ ఆమోదించిన చట్టాలు అమల్లోకి రావని, గవర్నర్ పాత్రను ఏ రాజ్యాంగ సంస్థ కూడా భర్తీ చేయలేదని స్పష్టంచేసింది. అలాగే ఆర్టికల్ 142 పరిధిలో కోర్టులు “డీమ్డ్ అస్సెంట్” (అనుమతిగా భావించడం) ప్రకటించలేవని ధర్మాసనం వెల్లడించింది.

గవర్నర్ బిల్లును రిజర్వ్ చేసిన ప్రతిసారీ రాష్ట్రపతి సలహా తీసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి లేదని కోర్టు చెప్పింది. బిల్లులో స్పష్టత లేకపోవడం లేదా అనుమానాస్పద అంశాలు ఉన్నప్పుడు మాత్రమే సుప్రీంకోర్టు సలహా తీసుకోవచ్చని తీర్పులో పేర్కొంది. గవర్నర్ పెండింగ్‌లో ఉంచడం వల్ల శాసన ప్రక్రియ నిలిచిపోతే, కోర్టులు పరిమిత ఆదేశాలు ఇవ్వగలవని స్పష్టంచేసింది.

సుప్రీంకోర్టు ఈ తీర్పు నేపథ్యంలో, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆర్టికల్ 143 కింద 14 ప్రశ్నలతో రిఫరెన్స్ కోరడం గమనార్హం. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ రిఫరెన్స్‌పై వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పాలిత రాష్ట్రాలు “గవర్నర్ విచక్షణలో జోక్యం” అని వాదించగా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు మాత్రం గడువు విధించడం రాజ్యాంగబద్ధమని సమర్థించాయి. దీంతో గవర్నర్-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పాత్రా వివాదంపై ఈ తీర్పు కీలక మార్గదర్శకాలు సూచించినట్టైంది.

Join WhatsApp

Join Now

Leave a Comment