సిద్ధార్థ్ లూథ్రాకి ఝలక్..! సుప్రీంకోర్టు హాల్‌లో నవ్వులు

సిద్ధార్థ్ లూథ్రాకి ఝలక్..! సుప్రీంకోర్టు హాల్‌లో నవ్వులు

ఏపీ లిక్కర్ స్కాం (AP Liquor Scam) కేసు విచారణలో సుప్రీంకోర్టు (Supreme Court)లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా సిట్(SIT) ప‌రిగ‌ణిస్తున్న వైసీపీ (YCP) నేత‌ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి (Chevireddy Mohith Reddy) ముందస్తు బెయిల్ (Bail) పిటిషన్‌పై వాదనలు కొనసాగుతుండగా, జస్టిస్ (Justice) విక్రమ్ నాథ్ (Vikram Nath) చేసిన వ్యాఖ్యలతో కోర్ట్ హాల్ (Court Hall) మొత్తం నవ్వులు (Laughter) పూయించింది.

లూథ్రా వాదనలపై జస్టిస్ కామెంట్
ఏపీ కూట‌మి ప్రభుత్వ తరఫున సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రా (Siddharth Luthra) హాజరై, చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా జస్టిస్ విక్రమ్ నాథ్ స్పందిస్తూ.. “అదేంటి సిద్ధార్థ్ లూథ్రా, మీరు దేశంలో పెద్ద పెద్ద స్కామ్ కేసుల్లో నిందితుల తరఫున వాదనలు చేస్తారు. జ‌న‌ర‌ల్‌గా బెయిల్ కోసం వాద‌న‌లు వినిపిస్తారు క‌దా, ఇప్పుడు మాత్రం బెయిల్ ఇవ్వొద్దంటారా? ఇది కాస్త వింతగానే ఉందే!” అని సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తి సెటైరిక‌ల్‌గా కామెంట్లు చేశారు. ఈ వ్యాఖ్యతో హాల్ అంతా నవ్వులతో నిండిపోయింది. లూథ్రా మాత్రం న్యాయ‌మూర్తి వ్యాఖ్య‌ల‌తో ఖంగుతిన్నారు.

బెంచ్ తీర్పు
ఇరుప‌క్షాల వాదనలు ముగిసిన తర్వాత బెంచ్ తన నిర్ణయాన్ని వెల్లడించింది. నిందితుడిగా ప‌రిగ‌ణించ‌బ‌డుతున్న చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి ఉపశమనం లభించింది. ఈ సంఘటనతో లూథ్రా వాదనలపై జస్టిస్ చేసిన వ్యాఖ్య సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తూ.. “ఇదే చంద్రబాబు ప్రభుత్వ  (Chandrababu Government) లాయర్ల (Lawyers’) స్థాయి. న్యాయస్థానం ముందు కూడా సరైన వాదనలు చేయలేక, సిగ్గు పడే పరిస్థితి తెచ్చుకున్నారు” అని విమర్శలు గుప్పిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment