‘శశివదనే’ లవ్‌స్టోరీ.. ట్రైలర్‌ విడుదల

'శశివదనే' లవ్‌స్టోరీ.. ట్రైలర్‌ విడుదల

‘పలాస 1978’ చిత్రంతో ఆకట్టుకున్న రక్షిత్ అట్లూరి కథానాయకుడిగా, కోమలీ ప్రసాద్ కథానాయికగా రూపొందుతున్న చిత్రం ‘శశివదనే’. ఇటీవలే ‘హిట్-3’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కోమలీ ప్రసాద్ ఈ సినిమాలో నటిస్తుంది. గోదావరి గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ వింటేజ్ ప్రేమకథకు సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి అహితేజ బెల్లంకొండ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాలో ‘ఆర్‌ఎక్స్ 100’ రాంకీ, రఘు కుంచె, కన్నడ నటుడు దీపక్ ప్రిన్స్ కూడా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment