ఆ మ‌హ‌నీయుల‌కు వైఎస్ జ‌గ‌న్‌ నివాళి

ఆ మ‌హ‌నీయుల‌కు వైఎస్ జ‌గ‌న్‌ నివాళి

సర్దార్ వల్లభాయ్ పటేల్, అమ‌ర‌జీవి పొట్టి శ్రీ‌రాములు వర్ధంతి సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వారికి నివాళులు అర్పించారు. దేశం యొక్క ఏకత్వం, సామాజిక సంస్కరణల పరంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపించిన దిశగా వల్లభాయ్ పటేల్ ఆలోచనలు మరింత ప్రేరణ కలిగిస్తాయని కొనియాడారు.

వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. “భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను. భారతదేశానికి ఏకత్వం, సామాజిక సంస్కరణలను అందించిన విజన్ ఉన్న నాయకుడు వల్లభాయ్ పటేల్. దేశాన్ని ఆయన ఉన్నతంగా తీర్చిదిద్దారు. భారతదేశ అభివృద్ది కోసం ఆయన ఆలోచనలు ఎప్పటికీ ప్రేరణ గా నిలుస్తాయి” అని ట్వీట్ చేశారు.

తెలుగువారి హృద‌యాల్లో చిర‌స్థాయిగా..
అదే విధంగా పొట్టిశ్రీ‌రాములు వ‌ర్ధంతి సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. ‘ప్ర‌త్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించి తెలుగు వారి హృద‌యాల్లో చిర‌స్థాయిగా నిలిచిన అమ‌రజీవి పొట్టిశ్రీరాములుగారి వ‌ర్ధంతి సంద‌ర్భంగా మ‌న‌స్ఫూర్తిగా నివాళులు‘ అని ట్వీట్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment