సోషల్ మీడియాలో తరచుగా పుట్టుకొచ్చే పుకార్లు మరోసారి ట్రెండింగ్‌లో ఉన్నాయి. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ (Sara Tendulkar) ప్రేమ, నిశ్చితార్థంపై నెట్టింట ఊహాగానాలు మొదలయ్యాయి. గతంలో టీమిండియా స్టార్ ఆటగాడు శుభ్‌మన్ గిల్తో సారా డేటింగ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు గోవాకు చెందిన ఆర్టిస్ట్ సిద్ధార్థ్ కేర్కర్ (Siddharth Kerkar)తో ఆమె సన్నిహితంగా ఉంటున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
సిద్ధార్థ్‌తో సారా బంధంపై చర్చ
సారా టెండూల్కర్, సిద్ధార్థ్ కేర్కర్‌తో కలిసి ఐపీఎల్ మ్యాచ్‌లకు హాజరవడం, అలాగే సచిన్, అంజలి టెండూల్కర్‌తో కలిసి పలు ఈవెంట్లలో కనిపించడం ఈ పుకార్లకు ప్రధాన కారణం. ఈ సన్నిహిత సంబంధాల నేపథ్యంలో, కొందరు వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, మరికొందరు వీరి నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని కథనాలు అల్లుతున్నారు.
వదంతులకు ముగింపు పలికిన వాస్తవాలు
అయితే, ఈ వార్తల్లో వాస్తవం ఎంత అనేది పరిశీలిస్తే, సిద్ధార్థ్ కేర్కర్ వృత్తిరీత్యా ఆర్టిస్ట్, మోడల్స్‌తో తరచుగా ఫొటోలు పోస్ట్ చేస్తుంటాడు. సారా కూడా మోడల్‌గా ఉన్నారు. సిద్ధార్థ్‌కు గోవాలో ఒక రెస్టారెంట్ కూడా ఉంది.
కాగా, సారా సోదరుడు అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం ఇటీవల ముంబై వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్‌తో జరిగింది. సానియా, సారాకు మంచి స్నేహితురాలు. ఈ మొత్తం వ్యవహారంలో సారా వ్యక్తిగత జీవితంపై అనవసరమైన ఊహాగానాలు చెలరేగుతున్నాయి తప్ప, అధికారికంగా ఎలాంటి ప్రకటనలు రాలేదు. సారా ఇటీవలే ఆస్ట్రేలియా టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ముంబైలో ఒక వెల్‌నెస్ సెంటర్‌ను కూడా ప్రారంభించారు.







