ఈ సంక్రాంతి వచ్చిందంటే చాలు సినిమా ప్రేమికులకు నిజమైన పండుగే. స్టార్ హీరోలు బరిలో దిగడంతో అభిమానుల్లో ఉత్సాహం తారాస్థాయికి చేరుతుంది. బడా స్టార్స్ హీరోలు సంక్రాంతికి విడుదలవ్వడం అదొక సెంటిమెంట్‌గా వస్తోంది. ఈ సంక్రాంతి పండుగకు ఇద్దరు సీనియర్ హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు సిద్ధమవుతున్నారు.
ఎవరు గెలుస్తారు?
ఈ పండగ సీజన్‌లో మూడు భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. జనవరి 10న రామ్ చరణ్ హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న గేమ్ ఛేంజర్ విడుదల కానుంది. జనవరి 12 బాలకృష్ణ ప్రధాన పాత్రలో బాబీ దర్శకత్వం వహిస్తున్న డాకు మహారాజ్ రిలీజ్ కానుంది. జనవరి 14న విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లు అనిల్ రావిపూడి దర్శకత్వంలో నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం
సినిమా విడదల కానుంది.
ఈ ముగ్గురు హీరోలు సంక్రాంతి బాక్సాఫీస్‌ను శాసించడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో సంక్రాంతి విన్నర్స్‌గా పేరు తెచ్చుకున్న బాలయ్య, వెంకీ మామలతో పాటు, రామ్ చరణ్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.ఈ మూడు సినిమాలపై సినీ అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి.