‘సంక్రాంతికి వస్తున్నాం’.. మీనూ లిరికల్ వీడియో విడుదల

'సంక్రాంతికి వస్తున్నాం'.. మీనూ లిరికల్ వీడియో విడుదల

విక్టరీ వెంకటేశ్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ నుంచి “మీనూ” లిరికల్ వీడియో విడుద‌లైంది. ఈ సాంగ్‌ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ మెలోడీ సాంగ్‌ను భీమ్స్ సిసిరోలియో మరియు ప్రణవి అందమైన స్వరాలతో పాడారు, ఈ పాటను అనంత శ్రీ‌రామ్ అందించారు.

మీనూ పాటకు భాను మాస్టర్ స్టైలిష్ కొరియోగ్రఫీ అందించగా, సాంగ్ విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా, జనవరి 14న సంక్రాంతి పండుగ సందర్భంగా సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

సంక్రాంతి సందడిలో ‘సంక్రాంతికి వస్తున్నాం’
ఈ సినిమా టీజర్, సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతున్నాయి. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ బ‌లంగా న‌మ్ముతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment