‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vasthunnam) మూవీ థియేటర్లలో తన హవాని కొనసాగిస్తోంది. ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి యాక్టింగ్ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచాయి.
సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం
సినిమా నేటితో 92 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఐటీటీల ప్రభావం కొనసాగుతున్న ఈ ఆధునిక రోజుల్లోనూ 50 రోజులు పూర్తిచేసుకొని తెలుగు సినిమా పరిశ్రమలో మరో మైలురాయిగా నిలిచింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం ఒక రీజినల్ మూవీ విభాగంలో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇప్పటికే రూ. 300 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించిన ఈ సినిమా, ప్రేక్షకుల ఆదరణతో ఇంకా థియేటర్లలో ప్రదర్శించబడుతోంది. సినిమా కథ, నటీనటుల పెర్ఫార్మెన్స్, మ్యూజిక్ వంటి అంశాలు సంక్రాంతికి వస్తున్నం సినిమాను బ్లాక్‌బస్టర్‌గా మార్చాయి.