‘సంక్రాంతికి వస్తున్నాం’.. వెంకటేశ్ కెరీర్‌లో అరుదైన రికార్డు

'సంక్రాంతికి వస్తున్నాం'.. వెంకటేశ్ కెరీర్‌లో అరుదైన రికార్డు

అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో విక్ట‌రీ వెంకటేశ్ హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఈ పండుగ సీజన్‌లో థియేటర్లలో విడుదలై సంచలన వసూళ్లను రాబడుతోంది. జనవరి 14న గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకొని భారీ విజయాన్ని అందుకుంది.

రూ.200 కోట్ల క్లబ్‌లో అరుదైన ఎంట్రీ
తాజాగా, ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ.200 కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఇది విక్ట‌రీ వెంకటేశ్ కెరీర్‌లో అత్యుత్తమ కలెక్షన్‌గా నిలిచి, మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ విజయంతో ‘సంక్రాంతికి వస్తున్నాం’ టీమ్ సంబరాల్లో మునిగిపోయింది. సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా విడుద‌లైన చిత్రాల్లో వెంక‌టేశ్ సినిమా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment