విజయ్ హజారే ట్రోఫీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దూరమైన సంజూ శాంసన్‌పై BCCI ఆగ్రహంతో ఉంది. ఈ విషయంపై త్వరలో విచారణ జరిపే అవకాశం ఉందని సమాచారం. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ జట్టుకు అతన్ని పక్కన పెట్టిన BCCI, ఇప్పుడు మరింత కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశముందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
BCCI వర్గాల ప్రకారం, సంజూ సరైన కారణాలు చెప్పకపోతే, అతడిని భవిష్యత్ ODI లకు పరిగణనలోకి తీసుకోకపోవచ్చు. గతంలో దేశవాళీ క్రికెట్ నుంచి దూరమైన ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌లు సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన సందర్భాన్ని గుర్తు చేస్తూ, ఇది సంజూ భవిష్యత్తుపై ప్రభావం చూపవచ్చని పేర్కొంటున్నారు.