భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) భార్య (Wife), ప్రముఖ వ్యాఖ్యాత సంజనా గణేశన్ (Sanjana Ganesan) సోషల్ మీడియాలో ట్రోలర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుమారుడు అంగద్ (Angad)పై జరుగుతున్న అనవసరమైన విమర్శలు, చర్చలపై ఆమె తీవ్ర అసంతృప్తిని తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ (Instagram Story) ద్వారా స్పందించిన సంజనా.. “నా కుమారుడు (My Son) మీ ఎంటర్‌టైన్మెంట్ (Entertainment) కోసం చర్చించాల్సిన టాపిక్ (Topic) కాదు. ఇలాంటి తక్కువస్థాయి కామెంట్లు సిగ్గుచేటు” అంటూ ఘాటుగా మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు నెటిజన్లలో పెద్ద చర్చకు దారితీశాయి. చాలామంది ఆమె స్పందనను మద్దతుగా అభినందిస్తూ పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు.
ఆదివారం ముంబై ఇండియన్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగ్గా, బుమ్రా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌కు బుమ్రా సతీమణి, ప్రముఖ వ్యాఖ్యాత సంజనా గణేషన్ తమ కుమారుడు అంగద్‌తో కలిసి హాజరయ్యారు. మ్యాచ్‌కు హాజరైన అంగద్ ఎక్స్‌ప్రెషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అగంద్ కాస్త నీరసంగా కనిపించడంతో డిప్రెషన్, ట్రామా వంటి వ్యాధుల పదాలు వాడుతూ కొంత మంది నెటిజన్లు బుమ్రా- సంజనాలను విమర్శించారు. నెటిజన్ల విమర్శలకు సంజనా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.