భారత టెన్నిస్ లెజెండ్ సానియా మీర్జా (Sania Mirza) మరోసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. గతంలో పాకిస్తాన్ క్రికెటర్ (Pakistan Cricketer) షోయబ్ మాలిక్ (Shoaib Malik)తో 2010లో వివాహం చేసుకున్న సానియా, 14 ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం 2024 జనవరిలో విడాకులు (Divorce) తీసుకున్నారు.
ప్రస్తుతం దుబాయ్ (Dubai)లో తన కుమారుడు ఇజ్హాన్ మీర్జా మాలిక్‌తో కలిసి నివసిస్తున్న ఆమె, తన కెరీర్, మాతృత్వంపై దృష్టి సారిస్తోంది. అయితే, తాజాగా ఆమె ఒక టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో(Star Hero)తో డేటింగ్‌లో ఉన్నట్లు టీ టౌన్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల ప్రకారం, సానియా ఆ హీరోతో చాలా కాలంగా సంబంధం కొనసాగిస్తున్నట్లు, త్వరలో వారిద్దరూ వివాహం చేసుకోనున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే, ఆ హీరో ఎవరనే విషయం ఇంకా బయటకు రాలేదు, ఇది అభిమానులలో ఊహాగానాలకు దారితీస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కాఫీ షాప్ ఫోటోలు ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూర్చాయి. అయినప్పటికీ, సానియా లేదా ఆమెతో సంబంధం ఉన్నట్లు ప్రచారంలో ఉన్న హీరో ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.