37కు చేరిన‌ ‘సిగాచి’ మృతుల సంఖ్య‌.. కీల‌క వివ‌రాలు ల‌భ్యం

37కు చేరిన‌ సిగాచి మృతుల సంఖ్య‌.. కీల‌క వివ‌రాలు ల‌భ్యం

పాశమైలారం (Pashamylaram) సిగాచి కెమికల్‌ ఫ్యాక్టరీ (Sigachi Chemical Factory)లో జ‌రిగిన‌ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. నిన్న ఉదయం 9:30 గంటల సమయంలో జరిగిన భారీ పేలుడు తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 37 మంది మరణించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రమాద సమయంలో కంపెనీలో సుమారు 130 మంది కార్మికులు, నలుగురు సెక్యూరిటీ సిబ్బంది, కంపెనీ మేనేజర్, షిఫ్ట్ ఇన్‌చార్జ్, బస్ డ్రైవర్‌తో సహా మొత్తం 141 మంది ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఉదయం 6 గంటలకు 70 మంది, 8 గంటలకు 30 మంది, జనరల్ షిఫ్ట్‌కు 9 గంటలకు మరో 30 మంది కార్మికులు విధులకు హాజరయ్యారు. హీట్ వేవ్ (Heat Wave) సప్లయర్ పైప్ (Supplier Pipe) డిస్ట్రాయర్ (Destroyer) విఫలమవడంతో సంభవించిన ఈ పేలుడు కంపెనీలో భారీ అగ్నిప్రమాదానికి దారితీసింది. పేలుడు సమయంలో కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఎల్.ఎన్. గోవన్ వెన్ (L.N. Gowan Ven) సహా 15 మంది మరణించినట్లు అధికారికంగా నిర్ధారణ అయింది. గోవన్ వెన్ తమిళనాడు నుంచి సెలవు పూర్తి చేసుకొని సోమవారం విధులకు హాజరై, కారు దిగి కంపెనీలో అడుగుపెట్టగానే కొన్ని సెకన్లలో మృతి చెందారు.

మృతులలో రంజినాల్ జగన్ మోహన్, నంగజిత్, శశిభూషణ్, మనోజ్ కుమార్, నాగేశ్వర్ రావు, సునీత్ కుమార్, సుదీప్ గుర్తించబడ్డారు. ఇటీవల నిశ్చితార్థం జరిగిన నిఖిల్ రెడ్డి, శ్రీ రమ్య కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆషాడం తర్వాత వీరి వివాహం జరగాల్సి ఉంది. మృతదేహాలు పూర్తిగా కాలిపోవ‌డంతో గుర్తుప‌ట్టేందుకు కష్టంగా మారింది, దీంతో డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి కుటుంబీకులకు అప్పగించనున్నారు. షిఫ్ట్ మేనేజర్ రాజశేఖర్ రెడ్డి సమయస్ఫూర్తితో దివ్య, సుష్మ అనే ఇద్దరు ఉద్యోగులను బయటకు తోసి కాపాడారు.

ప్రమాదం నుంచి 15 మంది క్షతగాత్రులను ధ్రువ హాస్పిటల్‌కు, 10 మందిని పటాన్‌చెరు అర్చన హాస్పిటల్‌కు తరలించగా, ముగ్గురు చికిత్స సమయంలో మరణించారు. ప్రమాదానికి కొద్దిసేపు ముందు 40 మందికి పైగా కార్మికులు బ్రేక్‌ఫాస్ట్ కోసం బయటకు వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే, మిగిలిన కార్మికులు కూలిపోయిన భవన శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. శిథిలాల తొలగింపు కోసం నాలుగు భారీ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. శిథిలాలు పూర్తిగా తొలగించే వరకు మృతుల సంఖ్య స్పష్టంగా తెలియదు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇవాళ‌ ఉదయం ప్రమాద స్థలాన్ని సందర్శించనున్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగనున్నాయని, పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment