గతేడాది డిసెంబర్ నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ (Sritej) ఎట్టకేలకు కోలుకున్నాడు. సికింద్రబాద్ (Secunderabad) కిమ్స్ ఆస్పత్రి (KIMS Hospital) నుంచి మంగళవారం సాయంత్రం డిశ్చార్జ్ (Discharged) అయ్యాడు. అతడిని రిహాబిలిటేషన్ సెంటర్‌కు తరలించినట్లు తండ్రి భాస్కర్ (Bhaskar) తెలిపారు. శ్రీతేజ్ కళ్లు తెరిచి చూస్తున్నాడని, 15 రోజుల నుంచి లిక్విడ్స్ నోటి ద్వారా తీసుకుంటున్నాడని శ్రీతేజ్ ఆయన వివరించారు.
డిసెంబర్ 4వ తేదీన ‘పుష్ప-2 (Pushpa-2)’ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాట (Stampede) జరిగింది. ఈ ఘటనలో రేవతి (Revathi) మృతిచెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. డిసెంబర్ 4వ తేదీ నుంచి శ్రీతేజ్‌కు చికిత్స పొందుతూ.. ఎట్టకేలకు ఇవాళ సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం బాలుడు కళ్లు తెరిచి చూస్తున్నాడని, గత 15 రోజులుగా నోటి ద్వారా లిక్విడ్ ఫుడ్ తీసుకుంటున్నాడని తండ్రి వెల్లడించారు. అయితే అతను ఇప్పటికీ మనుషులను గుర్తుపట్టడం లేదు కానీ, పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు.
తొక్కిసలాట ఘటనను సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పుష్ప-2 సినిమా హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ను అరెస్టు చేసి జైలు పంపించారు. కోర్టు అనుమతితో బెయిల్ పొందిన అల్లు అర్జున్‌ను పోలీసులు పలు దఫాలుగా విచారించారు. ఆ తరువాత బన్నీ ఇంటిపై రేవంత్‌రెడ్డి అనుచరుల దాడి, పోలీసు కేసు.. బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం ఇలా ఈ కేసులో అనేక హైడ్రామాలు చోటుచేసుకున్నాయి.
‘ఇది సినిమా కాదు బ్రదర్’.. – పవన్‌కు కాంగ్రెస్ ఎంపీ కౌంటర్