నటి సమంత (Samantha) మళ్లీ పెళ్లిపీటలు (Wedding Stage) ఎక్కేందుకు సిద్ధమవుతోందని సినీవర్గాల్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇటీవల నిర్మాత రాజ్ నిడుమోరు (Raj Nidimoru)తో ఆమె డేటింగ్లో ఉన్నట్లు గాసిప్స్ వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో నిన్న తిరుమల శ్రీవారిని (Tirumala Lord Venkateswara) సమంత-రాజ్ (Samantha–Raj) కలిసి దర్శించుకోవడం మరింత ఆసక్తికరంగా మారింది.
ఈ ప్రయాణం తర్వాత సోషల్ మీడియాలో ‘మే నెలలో వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారనే చర్చలు ఊపందుకున్నాయి. ఇరు కుటుంబాలూ ఈ సంబంధానికి అంగీకారం తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే సమంత వైపు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోయినా, అభిమానుల్లో మాత్రం ఆసక్తి తారస్థాయికి చేరింది. ఇంతకీ.. ఇది నిజమేనా లేక యధావిధిగా గాసిప్స్ మళ్ళీ చక్కర్లు కొడుతున్నాయా అన్నది సమంత-రాజ్‌ల నుంచి అధికారిక ప్రకటన విడుదలైతే తప్ప తెలియదు.








