ఆ సిగ్న‌ల్‌తో డేటింగ్‌లో ఉన్న‌ట్లు స‌మంత‌ కన్ఫర్మ్ చేసిందా?

ఆ సిగ్న‌ల్‌తో డేటింగ్‌లో ఉన్న‌ట్లు స‌మంత‌ కన్ఫర్మ్ చేసిందా?

టాలీవుడ్ స్టార్ సమంత (Samantha) ప్రేమలో ఉందా? ఈ విష‌యాన్నే ఆమె క‌న్ఫార్మ్ చేసింది అని, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు(Raj Nidimoru)తో ఆమె డేటింగ్‌లో ఉందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ (Gossip) జ‌రుగుతోంది. ఇందుకు తాజాగా జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మ‌మే నిద‌ర్శ‌న‌మ‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

చెన్నై జట్టుకు యజమానిగా ఉన్న సమంత, ఇటీవల జరిగిన పికిల్‌బాల్ టోర్నమెంట్ (Pickleball Tournament) ప్రారంభ వేడుకలో రాజ్ నిడిమోరుతో కలిసి సందడి చేసింది. ఈ సందర్భంగా ఆమె రాజ్ చేతిని పట్టుకున్న ఫొటోలు బయటకు రావడంతో, వీరి మధ్య ఏదో నడుస్తోందంటూ గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి.

ఇంతకు ముందు ‘ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్: హనీ బన్నీ’ ప్రాజెక్ట్‌లలో వీరిద్దరూ కలిసి పనిచేశారు. ఆ అనుబంధమే ప్రేమగా మారిందా? లేక వీరి మధ్య కేవలం స్నేహమేనా? అన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అయితే, వీరిద్దరూ ఈ విషయంపై ఇప్పటివరకు స్పందించలేదు.

Join WhatsApp

Join Now

Leave a Comment