టాలీవుడ్ స్టార్ నటి సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) మరియు దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru) వివాహం ఈరోజు ఉదయం కోయంబత్తూరు (Coimbatore)లోని ఇషా యోగా సెంటర్ (Isha Yoga Center)లో, లింగ భైరవి దేవాలయం (Bhairavi Temple) వద్ద అత్యంత సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది. ఈ వేడుక హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది. పెళ్లిలో సమంత ఎరుపు రంగు శారీలో మెరిసిపోతూ కనిపించిన ఫొటోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.
తమ పెళ్లి (Wedding)పై సమంత అధికారిక ప్రకటనలా ఫొటోలను విడుదల చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
నాగచైతన్యతో విడాకులు తీసుకున్న కొన్నాళ్ల తర్వాత సమంతకు దర్శకుడు రాజ్ నిడిమోరుదగ్గరయ్యారు. ‘ది ఫ్యామిలీ మేన్ 2’ షూటింగ్ సమయంలో పరిచయం మరింతగా దృఢపడిందని, అప్పటి నుంచి ఇద్దరూ తరచూ కలిసి కనిపించేవారు. ఎయిర్‌పోర్ట్ నుండి యోగా సెంటర్ వరకు వీరు కలిసి కనిపించిన ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో అభిమానుల్లో అప్పట్లోనే వీరి పెళ్లిపై అనేక ఊహాగానాలు వినిపించాయి. సమంత 2017 అక్టోబరులో నాగచైతన్యను పెళ్లి చేసుకుంది.
2021లో వ్యక్తిగత కారణాలతో ఈ జంట విడిపోయింది. విడాకుల తర్వాత సమంత పూర్తిగా తన హెల్త్, స్పిరిచ్యువల్ లైఫ్‌పై దృష్టి పెట్టింది. రాజ్‌కు సంబంధించిన కొన్ని వ్యాపారాలు, ఈవెంట్లలో కనిపిస్తూ వచ్చింది. నెటిజన్లు ఊహించినట్లుగానే సామ్-రాజ్ జంట పెళ్లితో ఒక్కటైంది.








