‘నా జీవితంలో దానికి చోటులేదు’ – సమంత సంచ‌ల‌న‌ సమాధానం

'నా జీవితంలో దానికి చోటులేదు' - సమంత సంచ‌ల‌న‌ సమాధానం

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ హీరోయిన్‌గా వెలుగొంది.. ప్ర‌స్తుతం సిల్వ‌ర్ స్క్రీన్‌కు దూరంగా ఉంటున్న ప్ర‌ముఖ నటి సమంత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన మాజీ భాగస్వామి కొత్త బంధంపై మాట్లాడారు. ఈ సందర్భంగా “మీకు అసూయగా అనిపించట్లా?” అని రిపోర్ట‌ర్ ప్ర‌శ్నించ‌గా.. అందుకు సమంత చురుకైన సమాధానం ఇచ్చారు. “నా జీవితంలో అసూయకు చోటులేదు. దాన్ని నేను అంగీకరించను. అసూయే అన్ని చెడులకు మూలం” అని తేల్చిచెప్పారు.

సమంత ఇప్పుడిప్పుడు తన వ్యక్తిగత జీవితాన్ని, కెరీర్‌ను మరింత పాజిటివ్‌గా కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో వ్యక్తిగత విభేదాలతో అక్కినేని నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకున్న‌ప్ప‌టికీ, ఆమె ఎప్పుడూ ఆత్మస్థైర్యాన్ని చాటుకుంటూనే ఉన్నారు. సమంత ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడు రాజ్‌ నిడిమోరుతో రిలేష‌న్‌లో ఉన్నార‌న్న పుకార్లు వ్యాపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment