సమంత కొత్త ప్రయాణం..

సమంత కొత్త ప్రయాణం..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samatha) సినిమాలతో పాటు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ దూసుకుపోతోంది. ఆరోగ్య సమస్యల నుంచి కోలుకున్న తర్వాత పూర్తిస్థాయిలో ప్రొఫెషనల్ లైఫ్‌లోకి తిరిగి వచ్చిన ఆమె, వరుసగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేయడంతో పాటు నిర్మాతగానూ అడుగుపెట్టింది. తాజాగా ఆమె తన సొంత బ్యానర్ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ కింద ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఇటీవలే పూజా కార్యక్రమం జరుపుకున్న ఈ సినిమాలో సమంతతో పాటు దిగంత్, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్లో నటించనుండగా, సీనియర్ నటి గౌతమి, మంజుషా కీలక పాత్రలు పోషించనున్నారు. రాజ్‌ నిడుమోరు, హిమాంక్ దువ్వూరుతో కలిసి సమంత ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. ఈ ప్రయాణం ఆమెను కేవలం నటిగానే కాక, కొత్త ప్రయోగాలకు ఆసక్తి చూపించే నిర్మాతగానూ నిలబెడుతోంది.

సినీ నిర్మాణంతో పాటు సమంత వ్యాపార రంగంలోనూ వేగం పెంచింది. ఇప్పటికే ఆమె ‘Saaki’ అనే క్లాతింగ్ బ్రాండ్‌ను విజయవంతంగా నిర్వహిస్తోంది. పెర్ఫ్యూమ్ బిజినెస్ తర్వాత, తాజాగా ఆమె ‘Truly Sma’ అనే సరికొత్త క్లాతింగ్ బ్రాండ్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త వెంచర్ ప్రారంభోత్సవం సందర్భంగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రమోషనల్ వీడియోను షేర్ చేస్తూ, “A New Chapter Begins” అనే క్యాప్షన్ ఇవ్వడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అభిమానులు, సినీ ప్రముఖులు సమంతకు శుభాకాంక్షలు తెలుపుతూ, ‘Truly Sma’ స్టైల్ ఎప్పుడూ యూనిక్‌గా ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. నటిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా కొత్త ప్రయాణాలు మొదలెట్టిన సమంత ప్రస్తుతం నిజంగానే ఒక ‘Truly Sma’ మోడ్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment