---Advertisement---

ఓపెన్‌ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్‌పై లైంగిక వేధింపుల కేసు

ఓపెన్‌ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్‌పై లైంగిక వేధింపుల కేసు
---Advertisement---

ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దాదాపు పదేళ్లుగా తనపై సామ్ లైంగిక వేధింపులకు పాల్ప‌డుతున్నాడ‌ని అత‌ని సోద‌రి కోర్టుకు వెల్లడించింది. ఈ ఘటన 1997 నుండి 2006 వరకు జరిగినట్లు ఆమె పేర్కొన్నారు. ఆమె వయసు మూడు సంవత్సరాలు ఉండగా సామ్ ఆల్ట్‌మన్ తనకు వేధింపులు చేస్తుండేవాడని సోదరి ఆవేదన వ్యక్తం చేశారు.

మానసిక ఒత్తిడితో కుంగిపోయాను
తనపై జరిగిన దారుణాలను ఆమె వివరిస్తూ, “సామ్ 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, నేను మూడు సంవత్సరాల వయసులోనే ఈ వేధింపులను ఎదుర్కొన్నాను. ఈ వేధింపులు నాకు తీవ్రమైన మానసిక ఒత్తిడిని కలిగించాయి. ఇప్పటికీ ఆ బాధలతో నేను జీవిస్తున్నాను” అని పేర్కొన్నారు.

సామ్‌ సోద‌రి అవాస్త‌వాలు ప్ర‌చారం చేస్తోంద‌ని, మా కుటుంబంపై, ముఖ్యంగా సామ్​పై అసత్య ఆరోపణలు చేసి మరింత ఎక్కువ బాధ పెడుతోంద‌ని, ఆమె గోప్యత దృష్ట్యా బహిరంగంగా స్పందించకూడదు అని అనుకున్నామ‌ని, కానీ, ఇప్పుడు ఆమె సామ్​పై కోర్టుకు వెళ్లడం వల్ల ఈ ప్రకటను విడుదల చేయాల్సి వచ్చింది అని సామ్ కుటుంబం ఓ ప్రకటనలో వెల్లడించింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment