---Advertisement---

సల్మాన్ ఖాన్ ఇంటికి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్.. ఎందుకంటే..

సల్మాన్ ఖాన్ ఇంటికి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్.. ఎందుకంటే..
---Advertisement---

బాలీవుడ్ స్టార్‌, కండ‌ల వీరుడు సల్మాన్ ఖాన్‌కు ఇటీవల వరుస హత్య బెదిరింపులు రావడం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆయన తన భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించుకున్నారు. తాజాగా, ముంబయిలోని తన ఇంటికి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌ను అమర్చించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతోంది.

అంతేకాకుండా సల్మాన్ ఇప్పటికే బుల్లెట్ ప్రూఫ్ కారును కొనుగోలు చేసి, ప్రయాణాల సమయంలో భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. రూ.2 కోట్లు విలువైన ఆ కారును దుబాయ్‌ నుంచి దిగుమతి చేసుకున్నారని టాక్‌. ఇక కేంద్ర ప్రభుత్వం సల్మాన్‌కు ‘వై’ కేటగిరీ భద్రత కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ చర్యలతో ఆయన అభిమానుల్లో ఉన్న ఆందోళన కొంత మేరకు తగ్గే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment