రక్తమోడుతున్న తండ్రిని ఆటోలో తీసుకెళ్లిన ఇబ్రహీం

రక్తమోడుతున్న తండ్రిని ఆటోలో తీసుకెళ్లిన ఇబ్రహీం

బాలీవుడ్‌ స్టార్ సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) దొంగ చేతిలో తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ఇంట్లోకి దొంగతనానికి వచ్చిన దుండగుడు సైఫ్ కుటుంబానికి భ‌యాన‌క పరిస్థితి సృష్టించాడు. తెల్లవారుజామున దొంగ తన పనిని ప్రారంభించే సమయంలో, పిల్లల బెడ్‌రూమ్ దగ్గర పనిమనిషితో ఘర్షణకు దిగాడు.

ఆరుసార్లు కత్తితో పొడిచి దాడి..
సైఫ్ అలీ ఖాన్ ఆ అలికిడిని గమనించి దొంగను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తోపులాటలో దుండగుడు సైఫ్‌పై ఆరుసార్లు కత్తితో దాడి చేసి పరారయ్యాడు. వెంటనే ఇబ్రహీం అలీ ఖాన్ రక్తమోడుతున్న తన తండ్రిని ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఉదయం 3:30 గంటలకు లీలావతి ఆసుపత్రిలో చేర్పించారు.

సర్జరీలు, ప్రస్తుత పరిస్థితి
వైద్యులు సైఫ్ వెన్నెముకలో 2.5 అంగుళాల కత్తి మొనను గుర్తించి సర్జరీ ద్వారా తొలగించారు. మెడపై ఉన్న లోతైన గాయానికి ప్లాస్టిక్ సర్జరీ చేశారు. ప్రస్తుతం సైఫ్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

సీసీటీవీ ఫుటేజ్, అనుమానాలు
పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగ నిన్న రాత్రే ఇంట్లోకి చొరబడ్డాడని నిర్ధారించారు. ఈ దాడి దొంగతనమేనా? లేక సైఫ్ శత్రువుల పథకం ప్రకారమా? అనేది ఇంకా అనుమానాస్పదంగా ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment