సైఫ్ అలీఖాన్‌పై క‌త్తితో దాడి.. ఆస్ప‌త్రికి త‌ర‌లింపు

హీరో సైఫ్ అలీఖాన్‌పై క‌త్తితో దాడి.. ఆస్ప‌త్రికి త‌ర‌లింపు

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై క‌త్తి దాడి జరిగింది. ముంబై బాంద్రాలోని సైఫ్ నివాసంలో ఓ దుండగుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. తెల్లవారుజామున ఇంట్లోకి చొరబడి పదునైన ఆయుధంతో అటాక్ చేసి, పరారయ్యాడు. ఆయన ప్రస్తుతం లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒంటిపై ఆరు చోట్ల గాయాలు కాగా, రెండు చోట్ల లోతైన గాయాలు అయినట్లు తెలుస్తోంది.

సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి అర్ధ‌రాత్రి దొంగ రావడంతో కొంతమంది సెక్యూరిటీ నిద్ర నుంచి మేల్కున్నారు. ఇంట్లో శబ్దం రావడంతో నిద్ర నుంచి మేల్కున్న సైఫ్ బయటకు వచ్చి ఆ దొంగను పట్టుకునేందుకు ప్రయత్నం చేశాడు. ఇంతలో ఆ దొంగ సైఫ్ పై కాత్తితో దాడి చేసి అతడిని తీవ్రంగా గాయపరిచాడు. కాగా, ఘటన అనంతరం దొంగ పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు ముంబై పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ తీవ్రంగా గాలిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ భార్య, నటి కరీనా కపూర్ ఖాన్, వారి పిల్లలు క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

Join WhatsApp

Join Now

Leave a Comment