అందుకే కదా సాయి పల్లవి అంటే అంత క్రేజ్!

అందుకే కదా సాయి పల్లవి అంటే అంత క్రేజ్!


ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో బోల్డ్ సన్నివేశాలకు దూరంగా ఉండే వారిని వేళ్లపై లెక్కించవచ్చు. సినిమాల్లో బోల్డ్ సీన్స్ చేయడం సర్వసాధారణం అయిపోయింది. “లేదు, చేయను” అని ఒక గిరి గీసుకుంటే అవకాశాలు రావు. కానీ సాయి పల్లవి (Sai Pallavi) మాత్రం అలా కాదు. తాను విధించుకున్న షరతులకు మేకర్స్ అంగీకరిస్తేనే సినిమా చేస్తుంది. లేదంటే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే నిర్మొహమాటంగా ‘నో’ చెప్పేస్తుంది. మంచి కథ ఉండి, తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమాలను అంగీకరిస్తుంది. అందులోనూ ఎలాంటి ఎక్స్‌పోజింగ్, రొమాన్స్ సీన్స్ లేకుండా చూసుకుంటుంది.

అందుకే సాయి పల్లవి ఏదైనా సినిమాకు సంతకం చేసిందంటే చాలు, ఆటోమేటిక్‌గా పాజిటివ్ హైప్ (Positive Hype) క్రియేట్ అవుతుంది. కెరీర్ ప్రారంభం నుంచీ ఆచితూచి అడుగులేస్తున్న సాయి పల్లవి.. ఇటీవల ‘తండేల్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘రామాయణ్’ (Ramayana)లో సీతగా నటిస్తోంది.

అయితే, ఇప్పటివరకు సాయి పల్లవి రొమాన్స్ చేసిన సినిమాలు లేవు. ముఖ్యంగా లిప్ లాక్ విషయంలో ఆమె చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. భారీ పారితోషికం ఇస్తాం, ఫలానా స్టార్ హీరోతో ఛాన్స్ మిస్ చేసుకోవద్దు అని చెప్పినా సరే నిర్మొహమాటంగా ‘నో’ చెప్పేస్తుంది. ఈ కారణంగానే ఆమె చాలా సినిమాలను వదులుకుంది. ఇకపైన కూడా అలాంటి వాటికి దూరంగా ఉండాలని అనుకుంటోంది. అవకాశాల కోసం ఏనాడు తాను పెట్టుకున్న నియమాలను బ్రేక్ చేయలేదు సాయి పల్లవి. బహుశా అదే ఆమెకు మంచి సినిమాలు వచ్చేలా చేసింది, ఆమెకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చేలా చేస్తుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment