వరుస హిట్లతో జోష్ మీదున్న అగ్ర కథానాయక సాయిపల్లవి(Sai Pallavi) సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె తాజాగా ఇంటర్వ్యూ(Interview)లో తన మనసులోని కోరికను బయటపెట్టేసింది. తన నటనకు జాతీయ అవార్డు(National Award) వస్తుందని ఎదురుచూస్తున్నానని, అందుకు ఓ ప్రత్యేకమైన కారణం ఉందని వెల్లడించింది.
తల్లి ఇచ్చిన చీరతో ప్రత్యేకమైన కోరిక
సాయిపల్లవి మాట్లాడుతూ “నాకు 21 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మా అమ్మ ఓ చీర ఇచ్చింది. పెళ్లి చేసుకున్నప్పుడు దానిని కట్టుకోమని చెప్పింది. కానీ, ఇప్పుడు ఆ చీరను కట్టుకొని జాతీయ అవార్డు అందుకోవాలని అనిపిస్తుంది” అని భావోద్వేగంతో చెప్పింది.
సాయిపల్లవి తన మనసులోని మాటను బయటపెట్టడంతో ఆమె ఫ్యాన్స్ ఆ ఆశయం నిజమవాలని కోరుకుంటున్నారు. సాయిపల్లవి సినిమాలకు సహజ నటనకు ప్రశంసలు లభిస్తుండటంతో, జాతీయ అవార్డు గెలుచుకునే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.