ఆ తిట్లు భ‌రించ‌లేక‌ వెక్కివెక్కి ఏడ్చిన సాయి ధ‌న్సిక‌

ఆ తిట్లు భ‌రించ‌లేక‌ వెక్కివెక్కి ఏడ్చిన సాయి ధ‌న్సిక‌

యాక్షన్ హీరో విశాల్‌ (Vishal) కు తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో ఉన్న ఆదరణ గురించి చెప్పనవసరం లేదు. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విశాల్, తెలుగులో కూడా గట్టి అభిమాన గణాన్ని సంపాదించాడు. సినిమాలతో పాటు, అతని పెళ్లి గురించిన వార్తలు కూడా తరచూ చర్చనీయాంశమవుతున్నాయి. గతంలో ఎంగేజ్‌మెంట్ జరిగిన విశాల్, తాజాగా చెన్నై (Chennai)లో జరిగిన ఓ సినిమా ఈవెంట్‌లో తన వివాహం గురించి స్పష్టత ఇచ్చాడు. నటి సాయి ధన్సిక (Sai Dhanshika) ను పెళ్లి చేసుకోనున్నట్టు ప్రకటించాడు. ధన్సిక కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది.

అయితే, ఈ సంతోషకరమైన సమయంలో గతంలో జరిగిన ఓ సంఘటన తిరిగి చర్చలోకి వచ్చింది. 2017లో విడుదలైన ‘విజితిరు’ (Vizhithiru) సినిమా ప్రెస్ మీట్‌లో, స్టార్ హీరో శింబు తండ్రి, నటుడు, దర్శకుడు టి. రాజేందర్, సాయి ధన్సికపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో కృష్ణ, విధర్త్‌తో పాటు ధన్సిక, రాజేందర్ కీలక పాత్రలు పోషించారు. ప్రెస్ మీట్‌లో ధన్సిక, రాజేందర్ పేరును పొరపాటున ప్రస్తావించకపోవడంతో, ఆయన స్టేజ్‌పై ఆమెను తీవ్రంగా విమర్శించారు. ‘కబాలి’ వంటి పెద్ద సినిమాలో నటిస్తున్నందున ఆమెకు పొగరు వచ్చిందని, శారీ కట్టుకోకపోయినా సారీ చెబుతోందని సెటైర్లు వేశారు.

ధన్సిక, రాజేందర్‌ను గౌరవిస్తానని, పొరపాటున పేరు మర్చిపోయానని క్షమాపణలు చెప్పినప్పటికీ, ఆయన విమర్శలు ఆపలేదు. స్టేజ్‌పై ఉన్నవారు రాజేందర్ వ్యాఖ్యలకు చప్పట్లు కొట్టడంతో, ధన్సిక అవమానంగా భావించి కన్నీళ్లు పెట్టుకుంది. ఈ సంఘటనపై విశాల్ ధన్సికకు అండగా నిలిచాడు. ‘‘ధన్సిక క్షమాపణలు చెప్పినప్పటికీ, టి. రాజేందర్ (T. Rajender) ఆమెను లక్ష్యంగా చేసుకొని మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను’’ అని విశాల్ పేర్కొన్నాడు. తాజాగా వీరిద్ద‌రి పెళ్లి ప్ర‌స్తావ‌న వైర‌ల్ కావ‌డంతో ఈ విష‌యం కూడా నెట్టింట్లో తిరుగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment