---Advertisement---

రైతు భరోసాపై కేబినెట్ స‌బ్ క‌మిటీ కీల‌క నిర్ణ‌యం

రైతు భరోసాపై కేబినెట్ స‌బ్ క‌మిటీ కీల‌క నిర్ణ‌యం
---Advertisement---

తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. గురువారం సచివాలయంలో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో జ‌రిగిన భేటీలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీలో రైతు భరోసా విధివిధానాలపై చర్చ జరిగింది. పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా అందించడానికి పథకాన్ని మరింత విస్తృతంగా అమలు చేయాలని నిర్ణయించారు.

దరఖాస్తుల ప్రక్రియ..
రైతు భ‌రోసా ప‌థ‌కం కింద రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు జనవరి 5 నుంచి 7వ తేదీ వరకు అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. జనవరి 14 త‌రువాత ఈ ప‌థ‌కం అమ‌లు చేయాల‌నే ఆలోచ‌నలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే, రైతు భరోసా అమలు విషయంలో ప్రజల నుంచి, వివిధ సంస్థల నుంచి పలు సూచనలను ప్రభుత్వం స్వీకరించింది.

అధికారుల సర్వే, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూములను గుర్తించనున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత రేవంత్‌ ప్రభుత్వం రైతు భరోసాను అమ‌లు చేసే యోచ‌న‌లో ఉంది. శ‌నివారం జరిగే కేబినెట్ సమావేశంలో రైతు భరోసా ప‌థ‌కానికి సంబంధించి ప్ర‌భుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు స‌మాచారం.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment