కుంభ‌మేళాలో వింత‌ ఘ‌ట‌న‌.. అఘోరాతో రష్యన్‌ మహిళ ప్రేమాయ‌ణం

కుంభ‌మేళాలో వింత‌ ఘ‌ట‌న‌.. అఘోరాతో రష్యన్‌ మహిళ ప్రేమాయ‌ణం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా (Kumbh Mela) ఎన్నో ఆసక్తికర సంఘటనలకు వేదికవుతోంది. ఇటీవల ఐఐటీబాబా, కండల బాబా వంటి గురువులు వైర‌ల్ కాగా, పూస‌ల దండ‌లు అమ్ముకునే మోనాలిసా త‌న క‌ళ్ల‌తో అంద‌రినీ ఆక‌ట్టుకొని ఏకంగా బాలీవుడ్‌లో సినిమా ఆఫ‌ర్‌ను కొట్టేసింది. ఇలా ఒక్కో రోజు ఒక్కో రకంగా మ‌హా కుంభ‌మేళా నుంచి కామ‌న్ పీపుల్ ఓవ‌ర్ నైట్‌లో సెలెబ్రిటీ స్టేట‌స్ సంపాదించుకుంటున్నారు.

తాజాగా మ‌రో వింత, ఆశ్చ‌ర్య‌క‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఓ రష్యన్ (Russia) యువ‌తి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కుంభ‌మేళాలో పుణ్య‌స్నానం కోసం రష్యా నుంచి వ‌చ్చిన‌ మహిళ ఓ అఘోరాతో ప్రేమలో (Love Story) పడిపోయింది. ఈ విష‌యాన్ని ఆవిడే స్ప‌ష్టం చేసింది. వీరిద్ద‌రూ ప్ర‌యాగ్‌రాజ్‌లో బైక్‌పై తిరుగుతూ కొత్త జీవితాన్ని ఆనందంగా గ‌డుపుతున్నారు. ఈ విషయం కుంభ‌మేళాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రేమకు ఎలాంటి పరిమితులు ఉండవని ఆమె చెబుతుండగా, ఈ సంబంధం ఎలా ముందుకు సాగుతుందో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment