‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ బ్యూటీ (Kannada Beauty) రుక్మిణి వసంత్ (Rukmini Vasanth), ఇప్పుడు టాలీవుడ్ (Tollywood)లో డిమాండ్ పెరుగుతున్న నటీమణులలో ఒకరిగా నిలిచింది. సెన్సిబుల్ పెర్ఫార్మెన్స్ (Sensible Performance)తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న రుక్మిణికి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.
ఇప్పటికే నిఖిల్ (Nikhil)తో కలిసి నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ (‘Appudo Ippudo Eppudo’) చిత్రంతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన రుక్మిణికి ఆ సినిమా పెద్దగా లాభాన్ని తీసుకురాలేకపోయినా, తాజాగా ఆమెకు ఒక భారీ అవకాశమే దక్కింది. మాస్ అండ్ మెంట్ ఎనర్జీకి మరో పేరు అయిన ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ లో రుక్మిణి ప్రధాన కథానాయికగా ఎంపిక కావడం విశేషం. ఇటీవలే ఈ సినిమా షూటింగ్లో కూడా ఆమె పాల్గొన్నట్టు సమాచారం.
కన్నడ పరిశ్రమతో పోలిస్తే టాలీవుడ్లో హీరోయిన్స్‌కు రెమ్యూనరేషన్ (Remuneration) మంచి స్థాయిలో లభిస్తుంటుంది. రుక్మిణి ఇప్పటివరకు తక్కువ పారితోషికంతో సినిమాలు చేసినప్పటికీ, ఎన్టీఆర్ సినిమా(NTR Movie) కోసం మాత్రం ఆమె కోటిన్నర (1.5 Crores) రెమ్యూనరేషన్ (Remuneration) డిమాండ్ (Demand) చేసిందట. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం నిర్మాతలు కూడా ఈ డిమాండ్‌ను అంగీకరించినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం పాన్-ఇండియా సినిమాల్లో స్టార్ హీరోయిన్స్ 5–6 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుండటంతో, రుక్మిణి డిమాండ్ కూడా సాధారణమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం అంటే, ఏ హీరోయిన్‌కైనా కరియర్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఈ అవకాశం రుక్మిణికి దక్కడం వల్ల, టాలీవుడ్లో ఆమెకు స్టార్ డమ్ రావడం ఖాయమని ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది.
తక్కువ రెమ్యూనరేషన్ కోసం వెనక్కి తగ్గేది లేదని, తన విలువ తెలిసిన పాత్రలకే ఒప్పుకుంటానన్న రుక్మిణి స్థైర్యం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.








