ప్రముఖ నటుడు మాధవన్ (Madhavan) బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్‌ఖాన్ (Shah Rukh Khan) గురించి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రొమాంటిక్ సినిమాల గురించి మాట్లాడిన మాధవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. “షారుక్ ఖాన్ చేసిన రొమాంటిక్ సినిమాలు (Romantic Films) ఎంతగానో ఆదరణ పొందాయి. అలాంటి సినిమాలు ఇప్పుడు చాలా తక్కువగా తయారవుతున్నాయి. ప్రేమకథలు ఇప్పుడు వెండితెరపై కనపడటం అరుదు అయిపోయింది” అని చెప్పారు.
తాను కూడా ‘రిహ్ణా హై తెరే దిల్ మే (Rehnaa Hai Terre Dil Mein)’, ‘అలాయ్ పాయుతే (Alaipayuthey)’ లాంటి ప్రేమకథలతో మంచి గుర్తింపు పొందిన మాధవన్, గతంలో ప్రేక్షకులు ప్రేమకథలతో ఎంత బాగా కనెక్ట్ అవుతారో గుర్తుచేశారు. అయితే ఇప్పటి ప్రేక్షకుల అభిరుచులు మారుతున్నాయనీ, ప్రస్తుతం యాక్షన్, థ్రిల్లర్ సినిమాలకే మక్కువ ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇటీవల ఓటీటీలో విడుదల అయిన టెస్ట్ (Test) సినిమాలో సిద్ధార్థ్, నయనతార, మాధవన్ నటించారు. తన నటన ద్వారా మరోసారి ప్రేక్షకుల ఆదరణ పొందారు నటుడు మాధవన్.