కమల్-సూర్య కాంబోలో భారీ బడ్జెట్ చిత్రం!

కమల్-సూర్య కాంబోలో భారీ బడ్జెట్ చిత్రం!

కమల్ హాసన్ (Kamal Haasan) నిర్మాణ సంస్థ, రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (Raaj Kamal Films International), మరో భారీ ప్రాజెక్టుకు (Big Project) సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈసారి సూర్య (Surya) కథానాయకుడిగా, యు. అరుణ్ కుమార్ (U. Arun Kumar) దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. సిద్ధార్థ్ హీరోగా వచ్చిన చిత్తా, విక్రమ్ కథానాయకుడిగా రూపొందిన వీర ధీర శూరన్ వంటి విజయవంతమైన చిత్రాలకు అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినప్పటికీ, సూర్య స్టార్‌డమ్‌ను దృష్టిలో ఉంచుకొని కమల్ హాసన్ (Kamal Haasan) ఈ సినిమాకు భారీ బడ్జెట్‌ను కేటాయించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కమల్ హాసన్ నటించి నిర్మించిన బ్లాక్‌బస్టర్ చిత్రం విక్రమ్లో సూర్య రోలెక్స్ పాత్రలో అతిథిగా కనిపించి ఎంతగానో మెప్పించిన విషయం తెలిసిందే.

నటుడిగా, నిర్మాతగా చురుగ్గా ఉన్న కమల్ హాసన్ ఇటీవల శివకార్తికేయన్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో నిర్మించిన అమరన్ ఘన విజయం సాధించింది. మణిరత్నం దర్శకత్వంలో, మద్రాస్ టాకీస్‌తో కలిసి రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హాసన్ హీరోగా నిర్మించిన థగ్ లైఫ్ చిత్రం ఇటీవలే విడుదలైంది. దీంతో పాటు, ప్రముఖ స్టంట్ మాస్టర్స్ అన్బరివ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో కమల్ హాసన్ నటించి, నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే జరుగుతున్నాయి.

ఇదిలా ఉండగా, సూర్య ప్రస్తుతం తన 45వ చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో ఉండగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తన 46వ చిత్రంలో నటిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment