టీమిండియా (Team India) కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) (హిట్‌మ్యాన్) తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా నిలుస్తాడు. రోహిత్ కెరీర్‌లో జనవరి 12, 2016 తేదీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం, పెర్త్‌లోని చారిత్రాత్మక WACA మైదానంలో ఆస్ట్రేలియా (Australia) ఫాస్ట్ బౌలింగ్‌ను ఎదుర్కొంటూ రోహిత్ అజేయంగా 171 పరుగులు సాధించి సంచలనం సృష్టించాడు. ఈ ఫాస్ట్, బౌన్సీ పిచ్‌పై హేజిల్ వుడ్, మార్ష్ వంటి దిగ్గజ బౌలర్లను ఎదుర్కొని 13 ఫోర్లు, 7 సిక్సర్లతో కూడిన ఈ విశ్వరూపం, రోహిత్ యొక్క నిలకడ మరియు దూకుడుకు నిదర్శనం. ఈ ఇన్నింగ్స్ భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
వచ్చే 2025లో భారత్-ఆస్ట్రేలియా (India-Australia) జట్ల మధ్య మళ్లీ పెర్త్‌లోని కొత్త మైదానం (ఆప్టస్ స్టేడియం)లో సిరీస్‌లోని తొలి మ్యాచ్ జరగనుంది. ఎల్లప్పుడూ ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలించే పెర్త్ పిచ్‌పై భారత బ్యాట్స్‌మెన్‌కు మరోసారి సవాలు ఎదురుకానుంది. అయితే, ఈసారి టీంలో ‘రోకో’ (రోహిత్-కోహ్లి) జోడి తిరిగి రావడం అతిపెద్ద బలంగా ఉంది. 2016 నాటి అద్భుతమైన జ్ఞాపకాలతో, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మళ్లీ అదే పెర్త్ నగరంలో చరిత్రను పునరావృతం చేస్తాడా లేదా అని క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.








