భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సిడ్నీ వేదికగా జరగబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) ఐదో టెస్టుతో తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలకనున్నారనే పుకార్లు విపరీతంగా షికార్లు చేస్తున్నాయి. బీసీసీఐకి ఈ విషయాన్ని రోహిత్ ఇప్పటికే తెలిపినట్లు అనధికారికంగా సమాచారం అందుతున్నా.. రోహిత్ అభిమానులు మాత్రం ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు. ఛాంపియన్ ట్రోఫీ వరకు రోహిత్ జట్టుకు నాయకత్వం వహిస్తాడని భావిస్తున్నారు.
రోహిత్ కెరీర్‌లో కొత్త మలుపు?
ఇటీవలి కాలంలో రోహిత్ శర్మ ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో రోహిత్ సతమతమవడమే కాకుండా, ఆసీస్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌ల్లో కూడా తక్కువ పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇది రోహిత్ రిటైర్మెంట్ నిర్ణయానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.