సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించారు. ఐపీఎల్ & ఛాంపియన్స్ లీగ్ టీ20 (CLT20) మ్యాచుల కలిపిన గణాంకాల్లో, ముంబై ఇండియన్స్ తరపున అత్యధిక సిక్సర్లు (259) బాదిన ఆటగాడిగా నిలిచారు.
కీరన్ పొలార్డ్ (258)ను వెనక్కి నెట్టి హిట్ మ్యాన్ రోహిత్ ఈ ఘనత సాధించారు. వీరి తరువాతి స్థానంలో సూర్యకుమార్ యాదవ్ (127), హార్దిక్ పాండ్యా (115), ఇషాన్ కిషన్ (106) సిక్సర్లతో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. 2009 నుంచి 2014 మధ్య జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ టీ20లో కూడా రోహిత్, పొలార్డ్ లు ముంబైకి ప్రాతినిధ్యం వహించారు.