టీమిండియా అభిమానులకు చేదు వార్త ఎదురైంది. మార్చి 2న న్యూజిలాండ్(India vs New Zealand)తో జరగనున్న మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఆడే అవకాశాలు తగ్గాయని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. రోహిత్‌కు విశ్రాంతి ఇవ్వబోతున్నారని, అతని స్థానంలో వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) జట్టును నడిపించనున్నారని చెబుతున్నారు.
పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడినట్లు తెలిసింది. ఇటీవలి ప్రాక్టీస్ సెషన్‌లోనూ అతను పూర్తిగా పాల్గొనలేదు. దీంతో, టీమ్ మేనేజ్‌మెంట్ అతనికి విశ్రాంతి ఇచ్చి, కేఎల్ రాహుల్‌ను ఓపెనర్‌గా, రిషభ్ పంత్‌ను వికెట్ కీపర్‌గా బరిలోకి దింపాలని యోచిస్తున్నట్లు సమాచారం.
భారత జట్టు తుది నిర్ణయం ఏదైనా, రోహిత్ లేకుండా న్యూజిలాండ్‌ను ఎదుర్కోవడం భారత క్రికెట్ జట్టుకు పెద్ద సవాలు కానుంది. మరి, గిల్ నేతృత్వంలోని టీమ్ ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి.