భారత క్రికెట్ దిగ్గజాలైన విరాట్ కోహ్లీ (Virat Kohli) , రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్ట్ క్రికెట్ నుండి అకస్మాత్తుగా రిటైర్ (Retire) అవ్వడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. దీంతో వారి భవిష్యత్తుపై, ముఖ్యంగా 2027 ప్రపంచ కప్‌లో ఆడతారా లేదా అనే అంశంపై తీవ్ర సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఈ ఊహాగానాలకు తెరదించుతూ బీసీసీఐ (BCCI) ఉపాధ్యక్షుడు (Vice-President) రాజీవ్ శుక్లా (Rajeev Shukla) ఒక స్పష్టమైన ప్రకటన చేశారు.
లండన్ (London)లో మీడియాతో మాట్లాడిన రాజీవ్ శుక్లా, రోహిత్, విరాట్ ఇద్దరూ 2027 ప్రపంచ కప్ (World Cup)లో ఆడటానికి సిద్ధంగా ఉన్నారని, వారు వన్డే క్రికెట్‌కు అందుబాటులో ఉంటారని ధృవీకరించారు. టెస్ట్ క్రికెట్ నుండి తప్పుకోవడం వారి వ్యక్తిగత నిర్ణయమని, రిటైర్మెంట్పై బీసీసీఐ ఎలాంటి జోక్యం చేసుకోదని ఆయన స్పష్టం చేశారు.
విరాట్ కోహ్లీ (36 సంవత్సరాలు) తన కెరీర్లో 302 వన్డే మ్యాచ్‌లలో 14181 పరుగులు సాధించి, 51 సెంచరీలతో వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు సృష్టించారు.
రోహిత్ శర్మ (37 సంవత్సరాలు) 273 వన్డే మ్యాచ్‌లలో 11168 పరుగులు చేశారు, ఇందులో 32 సెంచరీలు ఉన్నాయి. వన్డే క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (264) సాధించిన రికార్డు రోహిత్ పేరిట ఉంది. కెప్టెన్‌గా భారత జట్టుకు 2024 టీ20 ప్రపంచ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్‌ను అందించారు.