ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఆంధ్రప్రదేశ్ యువతి దుర్మరణం చెందింది. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన 26 ఏళ్ల యువతి నాగశ్రీవందన పరిమళ మృతిచెందింది. శుక్రవారం రాత్రి పరిమళ ప్రయాణిస్తున్న కారును ట్రక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్ర గాయాలతో మృతిచెందింది.
అమెరికాలో ఎంఎస్ చదువుతున్న పరిమళ
తెనాలికి చెందిన వ్యాపారి గణేష్, రమాదేవి దంపతుల కుమార్తె పరిమళ, 2022 డిసెంబరులో ఎంఎస్ పూర్తి చేయడానికి అమెరికా వెళ్లారు. ఆమె ప్రస్తుతం టెన్నెసీ రాష్ట్రంలో ఎంఎస్ చదువుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లో ఎంఎస్ పట్టా అందుకోనుండగా, ఈ దురదృష్టకరమైన ప్రమాదం జరగడం కుటుంబంలో విషాదాన్ని అలుముకున్నది.