బీహార్ అసెంబ్లీ ఎన్నికలు (Bihar Assembly Elections) సమీపిస్తున్న వేళ, బీజేపీ (BJP) నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి (NDA Alliance) పెద్ద షాక్ తగిలింది. రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (RLJP) అధినేత, కేంద్ర మాజీ మంత్రి పశుపతి కుమార్ పరాస్ (Pashupati Kumar Paras) ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగుతున్నట్టు (Withdrawing) అధికారికంగా ప్రకటించారు. “RLJP 2014 నుంచి ఎన్డీఏతో పొత్తులో ఉంది. కానీ ఎన్డీఏ నాయకత్వం మనకు న్యాయం చేయలేదు. ఆ కారణంగా ఇకపై ఆ కూటమితో మనకు సంబంధం ఉండదు” అని లోక్ జనశక్తి పార్టీ (RLJP) అధినేత పరాస్ క్యాడర్‌కు వెల్లడించారు.
దళిత పార్టీ RLJPకి ఎన్డీఏ అన్యాయం చేసిందని, అందుకే ఆ కూటమితో సంబంధాలు తెంచుకుంటున్నామని క్లారిటీ ఇచ్చారు పరాస్. ‘‘2014 నుండి ఎన్డీఏలో ఉన్నాను. కానీ ఎన్డీఏ మా పార్టీకి అన్యాయం చేసింది. ఈరోజు నుంచి నా పార్టీకి ఎన్డీఏతో ఎటువంటి సంబంధాలు ఉండవని ప్రకటిస్తున్నాను. దళిత పార్టీ (Dalit party) అయిన RLJPకి ఎన్డీఏ అన్యాయం చేసింది. అందుకే ఆ కూటమి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాం ’’ అని పేర్కొన్నారు. బీహార్‌లో అధికార బీజేపీ, జేడీయూ పార్టీలు RLJPని ఒంటరిని చేశాయని విమర్శించారు. ఈ నిర్ణయం బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.