టీమిండియా (Team India) వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ (Wicket-Keeper Batsman) రిషబ్ పంత్ (Rishabh Pant) ప్రాక్టీస్ సెషన్ (Practice Session)లో ఓ భారీ సిక్స్ (Huge Six)తో వార్తల్లో నిలిచాడు. ఇంగ్లాండ్ (England)తో జరగనున్న టెస్ట్ సిరీస్ (Test Series) కోసం గత వారం రోజులుగా నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్న పంత్, ఈ రోజు (జూన్ 10న) ఉదయం వాషింగ్టన్ సుందర్ (Washington Sundar)తో కలిసి ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పంత్ కొట్టిన బంతి నేరుగా వెళ్లి స్టేడియం పైకప్పుకు (Stadium Roof) తగలడంతో అది బద్దలైపోయింది. ఈ భారీ సిక్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
IPL 2025 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడిన పంత్, లీగ్ మ్యాచ్‌ల చివర్లో అద్భుతంగా రాణించి, చివరి మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు.
టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌కు గంభీర్ సూచనలు
మరోవైపు, టీమిండియా ప్లేయర్లు ప్రాక్టీస్ సెషన్లో తీవ్రంగా శ్రమిస్తున్న వీడియోలను బీసీసీఐ తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇందులో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా వంటి ఆటగాళ్లకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో కీలక సూచనలు చేస్తూ కనిపించాడు.
ఇంగ్లాండ్‌తో జరగనున్న ఈ టెస్ట్ సిరీస్ 2025 జూన్ నుంచి ఆగస్టు వరకు కొనసాగనుంది. మ్యాచ్‌లు లీడ్స్‌లోని హెడింగ్లీ, బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్, లండన్‌లోని లార్డ్స్, ది ఓవల్, మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియాల్లో జరగనున్నాయి.