రిషభ్ పంత్ రీఎంట్రీ

రిషభ్ పంత్ రీఎంట్రీ

గాయం కారణంగా కొంతకాలంగా భారత జట్టుకు దూరమైన స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్ త్వరలో మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. దక్షిణాఫ్రికా-ఎ జట్టుతో జరగనున్న రెడ్ బాల్ సిరీస్‌లో భారత్-ఎ జట్టుకు పంత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. యువ ఆటగాడు సాయి సుదర్శన్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గత జూలైలో మాంచెస్టర్ టెస్ట్‌లో పంత్‌ పాదానికి గాయమైంది.

అక్టోబర్ 30న బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో భారత్-ఎ, దక్షిణాఫ్రికా-ఎ మధ్య తొలి నాలుగు రోజుల మ్యాచ్ మొదలుకానుంది. పంత్ రంజీ ట్రోఫీ ద్వారా రీఎంట్రీ ఇస్తాడని భావించినప్పటికీ, భారత్-ఎ జట్టుతో ఆడనున్న నేపథ్యంలో అతడు రంజీ ట్రోఫీలో పాల్గొనే అవకాశాలు లేవు.

రెండు మ్యాచ్‌లకు జట్లు:

మొదటి మ్యాచ్ జట్టు: ఈ మ్యాచ్ కి కెప్టెన్ గా పంత్, వైస్ కెప్టెన్ గా సాయి సుదర్శన్ ఉంటారు. ఆయుష్ మ్హత్రే, ఎన్ జగదీశన్ (వి.కీ.), దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, హర్ష్ దూబే, తనుష్ కొటియన్, మానవ్ సూతర్, అన్షుల్ కాంబోజ్, యశ్ ఠాకూర్, సౌష్రాన్ బదూని, ఆయు.

రెండో మ్యాచ్ జట్టు : ఈ మ్యాచ్ కి కెప్టెన్ గా పంత్, వైస్ కెప్టెన్ గా సాయి సుదర్శన్ ఉంటారు. కెఎల్ రాహుల్, ధృవ్ జురెల్ (వి.కీ.), రుతురాజ్ గైక్వాడ్, ఖలీల్ అహ్మద్, గుర్నూర్ బ్రార్, అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్, హర్ష్ దూబే, తనుష్ కొటియన్, మానవ్ సూతర్, క్రిష్ణ.

Join WhatsApp

Join Now

Leave a Comment