---Advertisement---

క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేసిన‌ పంత్

క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేసిన‌ పంత్
---Advertisement---

టీమిండియా యువ క్రికెటర్ రిషభ్ పంత్ మరోసారి తన అసాధారణ ఆటతీరుతో ప్రపంచాన్ని ఆకట్టుకున్నారు. ఆసీస్ గడ్డపై అత్యధిక సిక్సర్లు బాదిన విదేశీ ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు పంత్ ఆసీస్ పై మొత్తం 15 సిక్సర్లు బాదారు. ఈ క్రమంలో క్రిస్ గేల్, వివియన్ రిచర్డ్స్ లు సంయుక్తంగా సాధించిన 12 సిక్సర్ల రికార్డును పంత్ బద్దలు కొట్టారు.

ఫాస్టెస్ట్ ఫిఫ్టీతో మరో ఫీట్
కేవలం సిక్సర్లతోనే కాకుండా, రిషభ్ పంత్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఆసీస్ గడ్డపై వేగవంతమైన అర్ధశతకం సాధించిన ఆటగాడిగా నిలిచారు. పంత్ కేవలం 29 బంతుల్లో ఈ ఫీట్ సాధించగా, గతంలో 33 బంతుల్లో ఫిఫ్టీ చేసిన ఈ రికార్డు రాయ్ ఫ్రెడెరిక్స్ పేరిట ఉంది. దాన్ని కూడా పంత్ బ్రేక్ చేశారు. విదేశీ గ‌డ్డ‌పై పంత్ ఈ రెండు ఫీట్లు సాధించడం టీమిండియా అభిమానుల్లో కొత్త జోష్ నిందింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment