సాధారణంగా హీరోలతో పోలిస్తే హీరోయిన్ల సంపాదన, ఆస్తులు తక్కువగా ఉంటాయని భావించేవారు. కానీ, బాలీవుడ్ నటి జూహీ చావ్లా అందరి అంచనాలను మించి, తానేంటో నిరూపించారు. తాజాగా విడుదలైన హురున్ ఇండియా 2024 సంపన్నుల జాబితాలో, జూహీ చావ్లా రూ.4,600 కోట్ల ఆస్తులతో టాప్ స్థానంలో నిలిచారు.
ఈ నివేదిక ప్రకారం, జూహీ కేవలం నటిగా మాత్రమే కాకుండా, విజయవంతమైన వ్యాపారిగా కూడా ఆమె రాణిస్తున్నారు. సినిమాల్లో నటనా జీవితాన్ని కొనసాగించడమే కాకుండా, వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం ఆమె ఆర్థిక శక్తికి తోడ్పాటుగా నిలిచింది. జూహీ సాధించిన ఈ విజయంతో, బాలీవుడ్‌లో మాత్రమే కాకుండా, దేశంలోని మహిళా వ్యాపారస్తులకు ప్రేరణగా నిలుస్తున్నారు. ఈ వార్త విని సినీ ప్రముఖులంతా ఒక్కసారిగా అవాక్కవుతున్నారు.