ఆంధ్రప్రదేశ్‌లో గత కొంతకాలంలో రేవ్ పార్టీ కల్చర్ విపరీతంగా విస్తరిస్తోంది. మొన్న జనసేన నేత బర్త్‌డే వేడుకల సందర్భంగా, నిన్న ఫెర్టిలైజర్స్ షాప్ యజమానులు, ఇవాళ మండపేటలో ఇలా రేప్ పార్టీ ఉదంతాలు బయటకు వస్తూనే ఉన్నాయి. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణం గొల్లపుంత రోడ్ లో ఉన్న బుద్ధస్టాట్యూ ఓం సిటీ లేఅవుట్‌లో రేవు పార్టీ జరిగినట్టుగాసమాచారం.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో కొంతమంది యువతులు, హిజ్రాలతో అర్ధనగ్న దుస్తులతో డాన్సులు చేయిస్తూ వారి మధ్య మందు కొడుతూ సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. యువకులు, పెద్దలు వారితో నృత్యాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఈ పార్టీని స్థానిక జనసేన పార్టీ నేతలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.