ఓయూకు సీఎం రేవంత్ రెడ్డి భారీ హామీ

ఓయూకు సీఎం రేవంత్ రెడ్డి భారీ హామీ

ఉస్మానియా విశ్వవిద్యాలయం (Osmania University) (OU) అభివృద్ధికి సీఎం(CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) భారీ హామీ ఇచ్చారు. తాజాగా రూ.90 కోట్ల వ్యయంతో నిర్మించిన పలు కొత్త భవనాలను ప్రారంభిస్తూ ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి అయ్యాక 20 ఏళ్ల తర్వాత ఓయూ(OU)కి విచ్చేసి ప్రసంగించిన తొలి సీఎంగా చరిత్ర సృష్టించారు.

సీఎం రేవంత్ మాట్లాడుతూ, “ఉస్మానియా విశ్వవిద్యాలయం అంటేనే తెలంగాణ గుర్తుకు వస్తుంది. రెండూ విడదీయరాని అనుబంధంతో ఉన్నాయి” అన్నారు. విద్యార్థుల కలలు, రాష్ట్ర గౌరవం కోసం ఓయూని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని సంకల్పం వ్యక్తం చేశారు. వర్సిటీ అభివృద్ధికి రూ.1000 కోట్లు మంజూరు చేస్తామని సీఎం స్పష్టంగా ప్రకటించారు. ఈ నిధులతో మౌలిక వసతుల అభివృద్ధి, పరిశోధన వసతులు, విద్యార్థుల సదుపాయాలను మెరుగుపరచనున్నట్లు హామీ ఇచ్చారు.

ఓయూ విద్యార్థుల భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్న ఓయూ మళ్లీ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందేలా చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment