ఏడీఆర్ నివేదిక‌.. గురుశిష్యుల‌కు ప‌ద‌వీగండం?

ఏడీఆర్ నివేదిక‌.. గురుశిష్యుల‌కు ప‌ద‌వీగండం?

దేశంలో ముఖ్యమంత్రులపై (Chief Ministers) ఉన్న క్రిమినల్ కేసులపై (Criminal Cases) అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ADR) తాజాగా కీలక నివేదిక విడుదల చేసింది. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులో భాగంగా, 30 రోజులు జైల్లో ఉంటే ఆ పదవి ఆటోమేటిక్‌గా రద్దు అవుతుంది అనే నిబంధన చేర్చిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నడుమే ఏడీఆర్ విడుదల చేసిన ఈ నివేదిక దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఏడీఆర్‌ నివేదిక ప్రకారం, తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్ రెడ్డి (Revanth Reddy) మొద‌టి స్థానం కైవ‌సం చేసుకోగా, ఆయ‌న‌కు గురువుగా తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన ఏపీ (AP)  సీఎం (CM) చంద్ర‌బాబు (Chandrababu) టాప్ 3 ప్లేస్‌లో నిలిచారు. అత్య‌ధిక క్రిమిన‌ల్ కేసులున్న ముఖ్య‌మంత్రుల జాబితాలో దేశంలోనే తెలుగు రాష్ట్రాల సీఎంలు టాప్ -1, టాప్‌-3 ప్లేస్‌ల‌లో నిల‌వ‌డం సంచ‌ల‌నంగా మారింది.

టాప్‌-1లో రేవంత్‌, 3లో చంద్ర‌బాబు
ఏడీఆర్ వివరాల ప్రకారం, దేశంలోని మొత్తం ముఖ్యమంత్రులలో 42% మంది పై క్రిమినల్ కేసులు ఉన్నట్టు తేలింది. అందులో రేవంత్ రెడ్డి 89 కేసులతో అగ్రస్థానంలో ఉండగా, మరికొందరు సీఎంలపై కూడా పలు కేసులు ఉన్నట్టు పేర్కొంది. త‌మిళ‌నాడు సీఎం ఎం.కే.స్టాలిన్ 42 కేసుల‌తో రెండ‌వ స్థానంలో నిల‌వ‌గా, ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం చంద్ర‌బాబు మూడో స్థానంలో ఉన్నారు. చంద్ర‌బాబుపై మొత్తం 19 కేసులు ఉన్నాయి. తీవ్రమైన నేరాభియోగాలు 32 ఉన్న‌ట్లుగా ఏడీఆర్ నివేదిక పేర్కొంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నాలుగవ స్థానం, 5వ స్థానంలో జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌(జేఎంఎం) ఉన్నారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఆ త‌రువాతి స్థానంలో ఉన్నారు.

మ‌రి 30 రోజులు జైల్లో ఉంటే సీఎం, పీఎం ప‌ద‌వి అయినా ఊస్టింగ్ అని కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన బిల్లు చ‌ట్టంగా మారితే.. వీరంతా పదవీచ్యుతులు అవుతారా..? అనే చ‌ర్చ జ‌రుగుతుంది. వీరిలో 30 రోజుల‌కు పైగా జైల్లో ఉన్న‌ది చంద్ర‌బాబు, రేవంత్‌రెడ్డి మాత్ర‌మే అని తెలుగు ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు. కేంద్రం కొత్త బిల్లు గురించి ప్ర‌కాశ్ రాజ్ వేసిన ట్వీట్ కూడా వైర‌ల్ అవుతోంది. ఓటుకు కోట్ల కేసులో రేవంత్‌, స్కిల్ స్కామ్‌లో చంద్ర‌బాబు నెల‌కు పైగా జైలు జీవితం గ‌డిపిన విష‌యం తెలిసిందే. అయితే, కేంద్రం కొత్త బిల్లు చ‌ట్ట రూపం దాల్చితే.. వీరికి ప‌ద‌వీ గండం త‌ప్ప‌ద‌ని చ‌ర్చించుకుంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment