తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు పెట్టే శాపాలకు సీఎం రేవంత్ రెడ్డి కుక్క చావు చస్తారన్నారు. అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రజలు పెట్టే శాపాలకు రేవంత్ రెడ్డి తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారని పేర్కొన్నారు.
ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను రేవంత్ మోసం చేశాడని, తెలంగాణ ప్రజలు పెట్టే శాపనార్థాలకు రేవంత్‌రెడ్డి కుక్క చావు చస్తాడన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పిచ్చి కుక్కలకు రేవంత్ రెడ్డి అధ్యక్షుడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు నమ్మి ఓటు వేసి గెలిపిస్తే, వారి విశ్వాసాన్ని వమ్ము చేశారని, ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడుతున్నారన్నారు. ఆరు గ్యారెంటీల హామీలతో మోసపోయిన ప్రజలు కాంగ్రెస్‌పై తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రజలు పెట్టే శాపాల రేవంత్ రెడ్డికి తప్పక తగులుతాయన్నారు.
నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ప్రస్తుతం కేసీఆర్ స్ట్రైచర్ మీద ఉన్నాడు.. త్వరలో మార్చురీకి పోతాడు అని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.








