తెలంగాణ (Telangana) సీఎం(CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ సీఎంగా కాక, కటింగ్ మాస్టర్ (Cutting Master)గా మారిపోయాడంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ (KCR) ప్రారంభించిన ప్రాజెక్టులకు రిబ్బన్ కట్ చేయడమే ఆయన పని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద విమర్శలు చేస్తూనే, మల్లన్నసాగర్ నుంచి నీళ్లు ఎలా తీసుకెళ్తున్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు.
హరీష్ రావు వ్యాఖ్యల్లో ముఖ్యాంశాలు:
ప్రజలు సీఎం రేవంత్ మాటలను నమ్మే పరిస్థితిలో లేరని వ్యాఖ్యానించారు.
బీజేపీని విమర్శిస్తూ “సబ్‌కా వికాస్ కాదు, పూరా బక్వాస్” అన్నారు.
ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటేనే కేంద్రం పని చేస్తుందన్నారు.
రాష్ట్రంలో ‘ఆర్ఆర్ఆర్ టాక్స్’ పేరుతో ప్రజలపై భారమేస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ హామీలు పూర్తిగా విఫలమయ్యాయని, 6 గ్యారెంటీలలో ఏదీ అమలు కాలేదని విమర్శించారు.
పింఛన్లు, ఉద్యోగాలు, రుణమాఫీ అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా తలకిందులైందని మండిపడ్డారు.
రైతుల రుణమాఫీలో కూడా రేవంత్ ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. “కేసీఆర్ ప్రభుత్వం 33 వేల కోట్ల రుణమాఫీ చేస్తే, రేవంత్ ప్రభుత్వం 19 వేల కోట్లకే పరిమితమైంది. రైతులకు యూరియా సరఫరా చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం” అని ధీమా వ్యక్తం చేశారు.








