ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి ఆయ‌న‌కే ఇవ్వాలి – సీఎం రేవంత్‌ డిమాండ్‌

ఆయ‌న‌కే ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి ఇవ్వాలి - సీఎం రేవంత్‌ డిమాండ్‌

కేంద్ర ప్ర‌భుత్వానికి (Central Government) తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్ రెడ్డి (Revanth Reddy) కీలక డిమాండ్ చేశారు. తెలంగాణకు చెందిన సీనియర్ బీజేపీ నేత బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya)కు భారతదేశ ఉపరాష్ట్రపతి (India’s Vice President) పదవి ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని కోరారు. “ఇది కేవలం రాజకీయ నిర్ణయం కాదు, బీసీ వర్గాలకు గౌరవం చేకూర్చే అవకాశం” అని రేవంత్ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ “బండారు దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే (NDA) ప్రకటిస్తే, నేను ఇండియా కూట‌మి నేతలతో మాట్లాడి ఆమోదింపజేస్తాను. తెలంగాణ‌ ప్రజలకే ఇది గౌరవమైన స్థానం అవుతుంది” అని చెప్పారు.

రాజకీయ వ్యత్యాసాలను పక్కన పెట్టి, తెలుగు వారి గౌరవం కోసం అన్ని పక్షాలతో చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. “తెలుగు ప్రజల తరఫున నేను ఈ డిమాండ్ చేస్తున్నాను. ఇది పార్టీల మధ్య పోటీ విషయంలో కాక, ప్రాంతీయ గౌరవానికి సంబంధించిన విషయం,” అని రేవంత్ రెడ్డి చెప్పారు. దత్తాత్రేయ రాజకీయ జీవితమంతా నిస్వార్థంగా పనిచేసిన నేతగా కొనియాడారు.

సీఎం రేవంత్‌రెడ్డి డిమాండ్‌పై తెలంగాణ ప్ర‌జ‌లు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య‌మంత్రిగా ఉంటూ బీజేపీ వ్య‌క్తి త‌ర‌ఫున మాట్లాడ‌డం ఏంట‌ని ప‌లువురు విమ‌ర్శ‌లు వ్య‌క్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ బీజేపీ నేత‌లు బండి సంజ‌య్‌, దత్తాత్రేయ‌ల‌కు అన్యాయం జ‌రిగింద‌ని ప్ర‌స్తావించ‌డంపై సొంత పార్టీ నేత‌లు సైతం విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment